జగన్ టార్గెట్ గా అక్రమ కేసులు: మాజీ మంత్రి నాని
జగన్ టార్గెట్ గా అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఏమీలేని కేసుల్లో సిట్ అంటూ ఏర్పాటు చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. స్కిల్ డెవలెప్ మెంట్ కేసులో చంద్రబాబునాయుడు 53 రోజులు జైలులో ఉన్నారని, ఒక్క రోజైనా అదనంగా జగన్ను జైల్లో ఉంచాలని చంద్రబాబు తొందరపడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. మద్యం కేసు రాజకీయ ప్రేరేపిత కేసు అని ఆరోపించారు.