ఎన్నికలు వాయిదా.. కోడ్ ఎత్తివేత: సుప్రీం ఆదేశాలు: ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

Politics Published On : Wednesday, March 18, 2020 03:31 PM

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై దేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా ఇచ్చిన తీర్పు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి అడ్డంకులు తొలగించిందా? ఇదివరకే ప్రకటించిన ఇళ్ల పట్టాల పంపిణీకి లైన్ క్లియర్ చేసిందా? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు ప్రభుత్వ పెద్దలు. స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూనే. ప్రవర్తనా నియమావళిని తక్షణమే ఎత్తేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడం ఊరట కలిగించేదేనని వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ వారు ఇది తమ గెలుపుగా చెప్పుకుంటున్నారు , జగన్ ఒంటెద్దు పోకడకు ఇది చెంపపెట్టులాంటిది అని అంటున్నారు.