వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు వైఎస్సార్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు పిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమ శిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.