సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి హత్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. వీరయ్య హత్యను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. తాను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త తెలిసిందని చెప్పారు. హత్య చేసిన నిందితులను పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఎవరికైనా హత్యపై సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 9121104784 కి సమాచారం ఇవ్వాలని ప్రజలకు సీఎం సూచించారు. హత్యా రాజకీయాలు చేసే వాళ్ళు కూడా చివరకు కాలగర్భంలో కలిసిపోతారన్నారు.