BJP Somu Veerraju: ఎవరు చెబితే ఎన్నికలు నిర్వహిస్తున్నారు: బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు 

Politics Published On : Friday, January 1, 2021 12:00 PM

Amaravati, Nov 21: రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణపై వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (BJP Somu Veerraju) ఎన్నికల కమిషనర్ పై మండి పడ్డారు. ఎవరు చెబితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను (AP SEC Nimmagadda Ramesh Kumar) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. 

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో హడావుడిగా ఎన్నికలు ఎందుకు నిర్వహించాల్సి వస్తోందో చెప్పాలని, ఎవరి డైరెక్షన్‌లో మీరు ఎన్నికలు నిర్వహిద్దామనుకుంటున్నారని మండిపడ్డారు.

అమరావతి పేరు చెప్పి రూ.7,200 కోట్లు ఖర్చు చేసినా ఒక్క శాశ్వత భవనం ఎందుకు నిర్మించలేకపోయారని చంద్రబాబుపై మండిపడ్డారు. అమరావతి కోసం వేల ఎకరాలు సేకరించి రైతులను నట్టేట ముంచారన్నారు. టీడీపీ హయాంలో ఉపాధి పథకాన్ని పక్కదారిపట్టించి రూ.కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. 

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు హయాంలో అమరావతిలో అన్ని తాత్కాలిక భవనాలేనని దుయ్యబట్టారు. రూ.7,200 కోట్లు ఖర్చు చేసి ఒక్క శాశ్వత భవనం కట్టలేకపోయారని ధ్వజమెత్తారు. అమరావతి కోసం వేల ఎకరాలు సేకరించి రైతులను నట్టేట ముంచారని మండిపడ్డారు. చంద్రబాబు ఉపాధి పథకాన్ని పక్కదారి పట్టించి రూ.కోట్లు దోచేశారని సోము వీర్రాజు నిప్పులు చెరిగారు.