ఏపీ నుంచి రాజ్యసభకు బీజేపీ నేత..?
ఏపీ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ సీటుపై ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఈ సీటును తగిన బలం ఉన్న కూటమి సర్కార్ (బీజేపీ-జనసేన-టీడీపీ) సొంతం చేసుకుకోనుంది.
ఈ క్రమంలో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఈ స్థానం నుంచి తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను రాజ్యసభకు పంపించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన పేరు ఖరారైనట్లు చర్చ సాగుతోంది.