120 ఏళ్ల తరవాత బృహత్తర కార్యక్రమం మొదలుపెట్టిన జగన్ .

Politics Published On : Tuesday, February 18, 2020 07:00 AM

అధికారం లోకి వచ్చినప్పటి నుండి తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. 120 సంవత్సరాల తరవాత ఈ భారీ పనిని మొదలుపెట్టనుంది. ఫిబ్రవరి 18- 2020 నుంచి పైలెట్ ప్రోజెక్టు కింద పని మొదలుపెట్టనున్నారు, ఈ పని పూర్తి అయితే భూ వివాదాలు లేని రాష్ట్రం గా ఆంధ్రప్రదేశ్ అవుతుంది అని ప్రభుత్వం ధీమావ్యక్తం చేస్తుంది.

వివరాలలోకి వెళితే దాదాపు 120 సంవత్సరాల క్రితం సమగ్ర భూ సర్వే జరిగింది. ప్రతి ముప్పై సంవత్సరాలకి ఒకసారి సర్వే జరగాల్సి ఉన్నా గత ప్రభుత్వాలు వాటిని మూలన పడేయటం వలన అనేక భూ వివాదాలు పెరుగుతూ వచ్చాయి. జగన్ పాదయాత లోనూ సమగ్ర భూ సర్వే పైన హామీ ఇచ్చారు, భూ రికార్డులు సరిగా లేకపోవటం వలన 60% సివిల్ కేసులు భూమికి సంభందించినవే ఉంటున్నాయని అంటున్నారు. సమగ్ర భూ సర్వే వలన ఇటువంటి వివాదాలకు తావుఉండదని ప్రభుత్వం చెప్తుంది. ఈ సర్వే వలన ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ , దేవాదాయ భూములు కూడా బయటపడతాయని భావిస్తున్నారు.

పైలెట్ ప్రోజెక్టు కింద కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలో ప్రారంభించనున్నారు. జగ్గయ్యపేట మండలంలోని 25 గ్రామాల భూమిని సర్వే చేసి, సర్వేలో వచ్చే సమయంలో వచ్చే సవాళ్ళను గుర్తించి వాటిని అధిగమించి రాష్ట్రమంతా సర్వే చేయనున్నారు. 2022 నాటికి సర్వే పూర్తి చేసి పటిష్టమైన భూ రికార్డులను రూపొందించనున్నారు.