మందుబాబులకు షాక్..!
హైదరాబాద్ లోని మందుబాబులకు పోలీసులు షాకిచ్చారు. ఏప్రిల్ 12వ తేదీన వైన్ షాపులు, బార్లు మూతపడనున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలను మూసి వేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. వైన్ షాపులు, బార్లతో పాటు కల్లు కాంపౌండ్ లను కూడా మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.