పాక్ కు భారత్ గట్టి దెబ్బ.. మొదలైన నీటి కష్టాలు..

News Published On : Thursday, May 1, 2025 01:24 PM

జమ్మూకశ్మీర్ లో పహల్గాం ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు మృతి చెందడంతో భారత్ పాక్తో సంబంధాలను పూర్తిగా తెంచుకుంది. దీనికి ప్రతీకారంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ క్రమంలో పాకిస్థానికి నీటి కష్టాలు మొదలైనట్లు తెలుస్తోంది. పాక్లోకి ప్రవహించే చీనాబ్ నది నీటి ప్రవాహం తగ్గినట్లు శాటిలైట్ ఫొటోల్లో కనిపిస్తుంది. చాలా వరకు కాల్వలు అన్ని కూడా ఎండిపోతున్నట్లు తెలుస్తోంది.