పాక్ లో మోగిన యుద్ధ సైరన్
భారత్- పాక్ మధ్య యుద్ధ సైరన్ మోగింది. ఏ క్షణమైనా పాకిస్తాన పై భారత్ దాడి చేయవచ్చని పాకిస్తాన్ లో యుద్ధ సైరన్లు మోగుతున్నాయి. 29 నగరాల్లో యుద్ధ సైరన్లు ఏర్పాటు చేసింది పాక్ ప్రభుత్వం. సైరన్లు మోగిస్తూ జనాల్ని అప్రమత్తం చేస్తోంది. భారత్ నుంచి వైమానిక దాడులు జరిగితే జనం ఎలా ప్రాణాలు కాపాడుకోవాలని సూచనలు చేస్తోంది. భారత్ నుంచి క్షిపణి దాడులు ఉంటాయన్న సమాచారంతో పాకిస్తాన్ ప్రభుత్వం ముందుగానే జనాల్ని అప్రమత్తం చేస్తోంది.