యుద్ధ వాతావరణం.. పాకిస్తాన్ లో హైఅలర్ట్
యుద్ధ భయంతో పాకిస్తాన్ లో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు త్రివిధ దళాలను పాకిస్తాన్ అప్రమత్తం చేసింది. భారత్-పాక్ సరిహద్దుల్లో భారీ సైన్యం మోహరించారు. ఈ నేపథ్యంలో గగనతలంలో వాయుసేన, అరేబియా సముద్రంలో నేవీ కసరత్తులు జరుగుతున్నాయి. ఈ అంశంలో భాగంగా ఫైరింగ్ రేంజ్ లను పాక్ ఆర్మీ చీఫ్ పర్యవేక్షించారు. అంతేకాకుండా POK ప్రజలకు పాక్ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. రెండు నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోవాలని సూచించారు.