టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న భక్తుల రద్దీని, ముఖ్యంగా వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని, వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు చేసింది. మే 1వ తేదీ నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం 6 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని టీటీడీ అధికారికంగా వెల్లడించింది.