ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్
జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్ లో సంభాషించారు. ఈ సందర్భంగా ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. మోడీకి ట్రంప్ ఫోన్ చేసిన విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తెలియజేశారు.