Breaking: సీఎంను హత్య చేస్తామంటూ బెదిరింపులు
ఢిల్లీ సీఎం రేఖా గప్తాకు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. సీఎం రేఖా గుప్తాను హత్య చేస్తామంటూ ఘజియాబాద్ కంట్రోల్ రూముకు గుర్తుతెలియని దుండగుడు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సీఎం రేఖా గుప్తాకు భద్రతను పెంచారు.