రేపే జాబ్‌మేళా రెడీగా ఉండండి...

News Published On : Wednesday, September 18, 2019 10:04 AM

రాష్ట్రం లోని నిరుద్యోగ యువతకు వివిధ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు హైదరాబాద్ లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో గురువారం(2019 సెప్టెంబర్ 19) మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్టు హైదరాబాద్ జిల్లా ఉపాధి అధికారి మైత్రిప్రియ తెలిపారు. నగరంలోని శ్రీరాం చిట్స్, హాస్పిటల్స్, అపోలో హోమియోకేర్ , నవత రోడ్ ట్రాన్స్‌పోర్ట్, వే సాఫ్ట్ టెక్నాలజీస్ తదితర సంస్థల్లో 400 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు. పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ , ఏఎన్‌ఎం , జీఎన్‌ఎం , బీఎస్సీ నర్సింగ్ చదివిన అభ్యర్థులు ఉద్యోగాలకు అరుహులు. ఎంపికైతే నెలకు రూ.10 వేల నుంచి రూ.18 వేల వరకు వేతనం చెల్లిస్తారని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు గురువారం(2019 సెప్టెంబర్ 19) విజయనగర్ కాలనీలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించే జాబ్‌మేళాకు సర్టిఫికెట్స్ తో హాజరుకావాలని, పూర్తి వివరాలకు 8247656356 లో సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.