ఏపి యువకులతో ఉగ్రవాదులకు సంబంధాలు.. ఇద్దరు అరెస్ట్
ఏపిలో ఉగ్రవాదానికి ఆకర్షితులైన ఇద్దరు అనుమానితులను హైదరాబాద్ పోలీసులు విజయనగరంలో అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. టెర్రరిస్ట్ ఐడియాలజీతో గడుపుతున్న సిరాజ్ ఉర్ రెహ్మాన్ (29)పై కొన్ని రోజులుగా నిఘా పెట్టి అరెస్టు చేశారు. అతడిచ్చిన సమాచారంతో హైదరాబాద్ కు చెందిన సయ్యద్ సమీర్ (28)ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది. కాగా సిరాజ్ తండ్రి పోలీస్ శాఖలో పనిచేస్తున్నట్లు సమాచారం.