పరీక్షల్లేకుండానే పాస్ చేస్తున్నాం.. ఇప్పుడే ప్రకటించిన సీఎం!

News Published On : Saturday, April 11, 2020 10:11 PM

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక లాక్ డౌన్ పైన ప్రకటన చేశారు. పరీక్షలపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన చెందుతున్న వేళ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు అన్ని క్లాసుల వారిని పరీక్షలు లేకుండానే తర్వాత తరగతికి ప్రమోట్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇక విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని చెప్పారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షలను పూర్తి అయ్యాయని, పదో తరగతి పరీక్షలపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఏప్రిల్ 30వ తేదీ వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 503 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందులో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. చికిత్స తీసుకున్న తర్వాత కరోనా తగ్గడంతో 96 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 393 మంత్రి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.