ప్రభుత్వం సంచలన నిర్ణయం
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. ఏటా క్యాన్సర్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే వీటిని కొంతలో కొంత తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందస్తుగా రోగులను గుర్తించవచ్చని సర్కారు భావిస్తోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 41 శాతం క్యాన్సర్ కేసులే ఉన్నాయని వైద్యులు తెలిపారు.