పెన్షన్ దారులకు గుడ్ న్యూస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని పెన్షన్ దారులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక భద్రత పెన్షన్ పథకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పెన్షన్ పథకం ద్వారా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, HIV బాధితులు, నేతన్నలు నెలవారి పెన్షన్ ను అందుకుంటున్నారు. అయితే గత ఐదు సంవత్సరాలలో 2.24 లక్షల మంది పెన్షన్ దారులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్టు సెర్ప్ గుర్తించింది.