పేకాట తప్పుకాదు: సుప్రీం కోర్టు
పేకాట నైతికంగా తప్పు కాదని, సరదాగా సొంత వాళ్లతో ఆడితే నేరంగా భావించలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ లో భాగంగా పేకాట ఆడితేనే నేరమని స్పష్టం చేసింది. రోడ్డు పక్కన పేకాట ఆడాడనే కారణంతో కర్ణాటకలో హనుమంతరాయప్ప అనే వ్యక్తిని ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ బోర్డు డైరెక్టర్ పదవి నుంచి తొలగించడం సరికాదని తెలిపింది. వెంటనే ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని ఆదేశించింది.