పాపం మగాళ్లు.. చెప్పుకోలేక చచ్చిపోతున్నారు
పురుషుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన న్యాయసహాయం లేకపోవడం, సమాజంలో సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేదని కుమిలిపోతున్నారని, అందుకే ఆత్మహత్యలు పెరుగుతున్నాయని అంటున్నారు. 2022లో ఆత్మహత్య చేసుకున్న వారిలో 72 శాతం మంది పురుషులే ఉన్నారు. లైంగిక వేధింపులు, గృహహింస కేసులు, అసత్య ఆరోపణలతో మగాళ్లు కుంగిపోతున్నారని వ్యాఖ్యానించారు. న్యాయపరమైన సంస్కరణలు అవసరమని నిపుణులు చెబుతున్నారు.