పబ్ లో లైట్లు ఆర్పి.. మహిళలపై అరాచకం
జూబ్లీహిల్స్ లోని బేబీలాన్ పబ్ లో తాము ఆర్డర్ చేయని డ్రింక్స్ కు బిల్ వేశారని ప్రశ్నించినందుకు కస్టమర్లపై సిబ్బంది దాడికి పాల్పడ్డారు. వీడియో తీస్తుంటే బెదిరించి పబ్ లో లైట్లు ఆపేసి తన తల్లి, చెల్లిని కొట్టారని సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మీనల్ మీను ఆవేదన వ్యక్తం చేసింది. బేబీలాన్ పబ్ పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ FIR నమోదు చేయలేదని మీనల్ మీను ఆవేదన వ్యక్తం చేసింది.