ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కు షాక్..

News Published On : Thursday, April 24, 2025 03:38 PM

జమ్మూ కశ్మీరులోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. అందుకే పాకిస్తాన్పై కొరడా ఝుళిపిస్తోంది. ఈక్రమంలోనే ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం వద్ద భద్రతను తగ్గించింది. ఆ ఆఫీసు వద్దనున్న బారికేడ్లను తీసి వేయించింది. దీంతో ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయానికి సెక్యూరిటీ తగ్గిపోయింది. తద్వారా భారత్ తన నిరసనను బహిరంగంగా తెలియజేసింది.