పదో తరగతి అర్హతతో 1,007 ఉద్యోగాలు
1,007 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ SESR (సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే) నోటిఫికేషన్ విడుదల చేసింది. నాగ్పూర్ డివిజన్లో ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, పెయింటర్, ప్లంబర్ తదితర పోస్టుల్లో ఖాళీలు ఉన్నాయి. పదో తరగతిలో 50 శాతం మార్కులతో పాటు ITI చేసి ఉండాలి. వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. https://secr.indianrailways.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. నేటి నుంచి మే 4 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.