ఎస్‌బిఐ డెబిట్ కార్డు దారులకు శుభవార్త, ఇకపై లక్ష వరకు డ్రా చేసుకోండి

News Published On : Tuesday, October 22, 2019 02:00 PM

ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు శుభవార్తను అందించింది. డెబిట్ కార్డు ప్రాతిపదికన రోజుకు రూ.20వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉపసంహరించుకోవచ్చు. అలాగే నెలకు 8 నుంచి 10 ఉచిత లావాదేవీలను నిర్వహించుకోవచ్చునని తెలిపింది. ఈ పరిమితి దాటితే కస్టమర్ల నుంచి కొంత ఛార్జ్ వసూలు చేస్తారు. దీంతో పాటుగా అక్టోబర్ 1వ తేదీ నుంచి బ్యాంకు సర్వీస్ ఛార్జీలను కూడా సవరించింది. అకౌంటులో నిర్ణీత అమౌంట్ లేకుండా ఏటీఎం ట్రాన్సాక్షన్ జరిపితే పెనాల్టీ ఉంటుంది. ఏఏ డెబిట్ కార్డుపై ఎంత విత్ డ్రా చేయాలో ఓ సారి చెక్ చేసుకోండి. 

ఎస్బీఐ క్లాసిక్ అండ్ మాస్ట్రో డెబిట్ కార్డు. 
బ్యాంకు ఎక్కువగా జారీ చేస్తున్న ఏటీఎం కమ్ డెబిట్ కార్డు ఇది. ఈ కార్డు ATM విత్ డ్రా లిమిట్ రూ. 20,000 వరకు డ్రా చేసుకోవచ్చు.
ఎస్బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు
మీరు ఎక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కార్డు ద్వారా అకౌంట్ యాక్సెస్ పొందవచ్చు. ఈ కార్డు ATM విత్ డ్రా లిమిట్ రూ. 40,000 వరకు ఉంది. 
ఎస్బీఐ మై కార్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు
ప్రపంచవ్యాప్తంగా ఈ కార్డును ఉపయోగించవచ్చు. ఈ కార్డు ATM విత్ డ్రా లిమిట్ రూ. 40,000 వరకు ఉంది.
ఎస్బీఐ ఇన్‌టచ్ ట్యాబ్ అండ్ గోడెబిట్ కార్డు
ఇది మల్టీపర్పస్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు. ఇందులో కాంటాక్ట్‌లెస్ టెక్నాలజీ కలిగినది. ఈ కార్డు ATM విత్ డ్రా లిమిట్ రూ. 40,000 
ఎస్బీఐ ముంబై మెట్రో కాంబో కార్డు
ముంబై మెట్రో స్టేషన్‌తో పాటు పేమెంట్ కమ్ యాక్సెస్ కార్డు ఇది. అలాగే స్టాండర్డ్ షాపింగ్ కమ్ ఏటీఎం డెబిట్ కార్డు కూడా. ఈ కార్డు ATM విత్ డ్రా లిమిట్ కూడా  రూ. 40,000 వరకు ఉంది. 
ఎస్బీఐ సిల్వర్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు
ఈ కార్డు ATM విత్ డ్రా లిమిట్ రూ. 40,000
ఎస్బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు
 ఈ కార్డు ATM విత్ డ్రా లిమిట్ రూ. 50,000.
ఎస్బీఐ ప్లాటినమ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు
ఈ కార్డు ATM విత్ డ్రా లిమిట్ ₹1,00,000 వరకు ఉంది. ఈ కార్డు ద్వారా మీరు భారత్‌తో పాటు