స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్

News Published On : Saturday, June 14, 2025 09:00 AM

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ దిశగా కసరత్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి సీతక్క చేసిన ప్రకటన ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. జూలై నెలలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. పార్టీలోని పాత, కొత్త నేతల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.