రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త డిజైన్ మోటార్ సైకిల్

News Published On : Tuesday, February 25, 2020 11:46 PM
భారతీయ మార్కెట్లో ఇటీవల కాలంలో ఎక్కువ అమ్మకాలు చేపడుతున్న ద్విచక్ర వాహన సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి విడుదలైన వాహనాలు నేటి యువతను మాత్రమే కాకుండా చాలా మందిని ఆకర్షించింది. ఇంతటి ప్రాధాన్యత పొందిన రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ మరో కొత్త మోటార్ సైకిల్ ని పరిచయం చేసింది. ఈ కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం! నాసిక్ ఆధారిత కస్టమ్ మోటారుసైకిల్ బిల్డర్ ఆర్నితోప్టర్ మోటో డిజైన్ రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రా 350 ను సవరించింది. ఈ సవరించిన మోటార్ సైకిల్ మునుపటి మోడల్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది.