రిటైర్మెంట్ వయసు పెంపు
తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇవి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెంచారు. హెల్పర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. అంగన్వాడీ సిబ్బంది పదవీవిరమణ వయసు 65 సంవత్సరాలకు పెంచారు. 60 ఏళ్లు దాటి వీఆర్ఎస్ తీసుకునే టీచర్లకు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తిస్తాయి.