నేడే పది ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి...
ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలకు రంగం సిద్ధమైంది. నేడు ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో పాటు ఓపెన్ స్కూల్ పదవ తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్ష ఫలితాలను సైతం విడుదల చేసినట్లుగా ప్రభుత్వం పరీక్షల విభాగం డైరెక్టర్ KV శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. విద్యార్థుల ఫలితాలను https://bse.ap.gov.in వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.