403 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

News Published On : Monday, May 19, 2025 05:01 PM

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) లో స్పోర్ట్స్ కోటాలో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేయనుంది. 403 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్ లైన్ దరఖాస్తులు జూన్ 6 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఇంటర్ అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫిజికల్ టెస్ట్, ఆటల్లో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.