త్వరలో కొత్త నోట్లు.. మరి పాత వాటి సంగతేంటి..?
RBI నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. త్వరలోనే మహాత్మా గాంధీ సిరీస్ లో కొత్త రూ.20 నోట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ నోట్లపై ప్రస్తుత RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. ఈ నోట్ల డిజైన్ అన్ని రకాలుగా గాంధీ సిరీస్ రూ. 20 నోట్లను పోలి ఉంటుందని తెలిపింది. దీంతోపాటు గతంలో కేంద్ర బ్యాంకు జారీ చేసిన అన్ని రకాల రూ.20 నోట్లు చట్టబద్ధంగా చెలామణిలో ఉంటాయని RBI స్పష్టం చేసింది.