రెండు విడతల్లో ఖాతాల్లోకి డబ్బులు
తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకం కింద ప్రభుత్వం అందించే సబ్సిడీ డబ్బులు రెండు దశల్లో విడుదల చేయనుంది. పథకం మంజూరయ్యాక కొంత మొత్తం,యూనిట్ ఏర్పాటు చేసుకున్నాక మిగిలిన మొత్తాన్ని రిలీజ్ చేస్తామని ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. లబ్ధిదారులకు 3 నుంచి 15 రోజులపాటు ట్రైనింగ్ కూడా ఇస్తామని తెలిపారు. 50వేలనుంచి 4 లక్షల వరకు సబ్సిడీతో సాయం అందించనుంది. ఈనెల 24 వరకు ఈ పథకం యొక్క గడువు ముగియనుంది.