స్వయం ఉపాధికి అవకాశం.. నేటితో ముగియనున్న గడువు
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల గడువు తేదీని మరో 10 రోజుల పాటు పొడిగించాలని నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు.
ఆఫ్లైన్లో వచ్చిన మరో 2 లక్షలకుపైగా దరఖాస్తులను నెట్వర్క్ ఇబ్బందులతో ఆన్లైన్ చేయలేకపోయారు. ప్రక్రియలో పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. సర్వర్ లోపాలు తలెత్తడంతో దరఖాస్తు ప్రక్రియ నత్తనడకన సాగింది. వరుస సెలవులు, నెట్వర్క్ ఇబ్బందుల దృష్ట్యా కనీసం మరో వారం రోజులు గడువు పెంచాలని వినతులు వస్తున్నాయి.