నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

News Published On : Thursday, January 24, 2019 11:44 AM

నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంలో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా తెలంగాణ నుంచి రాయలసీమ వరకు అదే ఎత్తులో సమాంతరంగా ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. ఈ ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణ మరియు రాయలసీమతో పాటు కోస్తాలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రానున్న 36 గంటల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనున్నట్లు తెలిపారు.