దేశవ్యాప్తంగా రైతు బంధు ప్రతి ఏడాది రూ. 6 వేలు!

News Published On : Friday, February 1, 2019 12:18 PM

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర పీయూష్ గోయల్ శుక్రవారం లోక్‌సభకు సమర్పించారు. అయితే తాత్కాలిక ఆర్థికమంత్రిగా వ్యవహరిస్తున్న పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా ఉదయం 10 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమయిన కేబినెట్ 2019 బడ్జెట్‌ను ఓట్ ఆన్ అకౌంట్ ద్వారా ఆమోదించింది.

పీయూష్ గోయెల్ పార్లమెంటులో ప్రసంగంచే ముందు అమెరికాలో చికిత్స పొందుతున్న అరుణ్ జైట్లీ త్వరగా కోరుకోవాలని ఆకాంక్షిస్తూ కేంద్ర బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశనవ్యాప్తంగా ఉన్న చిన్న మరియు సన్నకారు రైతుల కోసం బడ్జెట్‌లో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. సుమారుగా 12 కోట్ల మంది రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా రైతు బంధును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రైతులందరికీ ప్రతి ఏటా రూ. 6,000 పంట సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తామని వివరించారు. ఈ పథకం 2018 డిసెంబర్ నుండి అమల్లోకి వస్తుందని, తొలి విడత క్రింద రూ. 2 వేల రుపాయలను రైతులకు అందివ్వనున్నట్లు వివరించారు.