జ్యోతి మల్హోత్రా డైరీ స్వాధీనం.. అందులో కీలక విషయాలు
పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేశారనే ఆరోపణలపై ఇటీవల అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యక్తిగత డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జ్యోతి అనేక సార్లు పాకిస్థాన్ కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. స్వాదీనం చేసుకున్న డైరీలో పలు కోడ్ భాషల్లో పదాలు ఉన్నాయి. ఐతే భారత్ సమాచారాన్ని పాక్ కు కోడ్ భాషల్లో తెలిపేందుకు ఇలా రాసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కోడ్ భాషను ఛేదించే పనిలో పోలీసులు ఉన్నారు.