Breaking: మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కీలకమైన రోడ్డు ప్రమాద కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు అరెస్టు చేయడం సంచలనం కలిగించింది. ప్రగతిభవన్ ఎదుట జరిగిన ఈ ప్రమాదంలో షకీల్ కుమారుడు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే, ఈ కేసులో షకీల్ కూడా నిందితుడిగా తేలడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన అనంతరం షకీల్ ను వెంటనే కోర్టులో హాజరుపరిచారు.