పెట్రోల్ లీటర్ ధర రూ. 34 మరియు డీజల్ లీటర్ రూ. 38 మాత్రమే!

News Published On : Saturday, December 22, 2018 11:05 AM

ఇండియాలో వస్తు ధరకు సమానమైన మొత్తాన్ని ట్యాక్స్ రూపంలో చెల్లిస్తున్న వస్తువులేమైనా ఉన్నాయా అంటే.. ముందుగా గుర్తొచ్చేది పెట్రోల్ మరియు డీజల్. అవును ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువులైన పెట్రోల్ మరియు డీజల్‌కు వాటి అసలు ధరలకు సమానమైన మొత్తాన్ని ట్యాక్స్ రూపంలో చెల్లిస్తున్నాము.

ఉదాహరణకు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ అసలు ధర రూ. 34.08 మరియు లీటర్ డీజల్ ధర రూ. 38.67 లు మాత్రమే. కానీ పెట్రోల్ మీద రూ. 17.98, రాష్ట్ర వ్యాట్ రూ. 15.02 మరియు డీలర్ కమీషన్ రూ. 3.59 లను కలుపుకొని అది వినియోగదారుడుకి చేరేసరికి రూ. 70 లుగా ఉంది. డీజల్‌కు కూడా ఇదే తరహా పన్నులు వర్తిస్తాయని కేంద్ర మంత్రి శివ ప్రతాప్ శుక్లా లోక్‌సభలో వెల్లడించారు.
ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి...