హెచ్చరిక : కొనసాగుతున్న తుఫాన్!

News Published On : Sunday, December 16, 2018 01:16 PM

బంగాళాఖాతంలో పెథాయ్‌ తుపాను కొనసాగుతోంది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 690 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 13 కి.మీ వేగంతో తుపాను కదులుతోంది. తుఫాన్‌ గమనాన్ని అనుక్షణం ఆర్టీజీఎస్‌ గ‌మ‌నిస్తోంది. రానున్న 24 గంటల్లో పెథాయ్‌ తీవ్ర తుపానుగా మారే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. రేపు 17న కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు.