పెథాయ్ దెబ్బకు వణికిపోతున్న కోస్తా...

News Published On : Monday, December 17, 2018 07:43 AM

తీవ్ర తుఫాన్‌గా మారిన పెథాయ్ తీరం దిశగా వేగంగా కదులుతోంది. ఇప్పటికే అధికార యంత్రాంగం తీరం వెంబడి ఉన్న జిల్లాలో హై అలర్ట్ ప్రకటించింది. పెథాయ్ తుఫాన్ కోస్తాను విపరీతంగా వణికిస్తోంది. ఈ రోజు సాయంత్రం కాకినాడ సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. గంటకు 26 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతున్నట్లు అధికారులు చెప్పారు. మచిలీ పట్టణానికి 380 కిమీలు దూరంలో, కాకినాడకు 360 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయ దిశగా తుఫాన్ కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొన్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 100 నుండి 110 కిమీల వేగంతో బలమైన కాలుల వీస్తాయని వివరించారు. కోస్తా ప్రాంతంలో ఉన్న తూర్పు గోదావరి, విశాఖపట్టణం, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.