కాల్పులు ప్రారంభించిన పాకిస్థాన్.. యుద్ధం మొదలు..?
సీజ్ ఫైర్ ఎత్తేయడంతో నియంత్రణ రేఖ వెంబడి భారత్ పై పాకిస్థాన్ కాల్పులు ప్రారంభించింది. పాక్ సైనికులు కాల్పులు మొదలుపెట్టారని, వారికి సైన్యం సమర్థంగా బదులిస్తోందని భారత సైనిక వర్గాలు తెలిపాయి. కాల్పుల విరమణ అమల్లో లేని కారణంగా సరిహద్దు వెంబడి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉంది.