పదేళ్లు దాటితే సొంత లావాదేవీలు
ప్రస్తుతం మైనర్లకు బ్యాంక్ అకౌంట్లు తీసుకునే సదుపాయం ఉన్నప్పటికీ ఎవరైనా గార్డియన్ గా ఉండటం తప్పనిసరిగా ఉంది. అయితే ఇకపై పదేళ్లు దాటిన పిల్లలు కూడా ఖాతాలను సొంతంగా నిర్వహించుకునేలా RBI మార్గదర్శకాలను విడుదల చేసింది. సేవింగ్స్, టర్మ్ డిపాజిట్ అకౌంట్లను తెరిచి లావాదేవీలను సాగించవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATM, చెక్ బుక్ సదుపాయమూ ఉంటుంది. జులై 1 నుంచి ఈ రూల్స్ అమలు చేయాలని బ్యాంకులను RBI బ్యాంకులను ఆదేశించింది.