లాక్ డౌన్ ఎఫెక్ట్, హైదరాబాద్ లో ఘోర విషాదం

News Published On : Monday, March 30, 2020 07:52 PM

లాక్ డౌన్ వలన జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడిక్కడే ప్రజా రవాణా నిలిచిపోయాయి. వలస వెళ్లిన కూలీలు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిని ఆదుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. పలు స్వచ్చంద సంస్థలు ముందుకొచ్చి ఇలాంటి వారి ఆకలిని తీరుస్తున్నారు. కానీ ఓ వృద్ధుడు ఆకలతో అలమటించి చనిపోయడు. ఈ విషాద ఘటన ఎక్కడో మారుమూల గ్రామంలో జరగలేదు. హైదరాబాద్ నడిబొడ్డున చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే హుమాయిన్ నగర్ లో 60 సంవత్సరాలున్న ఓ వృద్ధుడు ఫుట్ పాత్ పై పడి ఉన్నాడు. సోమవారం ఉదయం ఈ ప్రాంతం గుండా పోలీసులు వెళుతుండగా సార్ ఆకలిగా ఉందని చెప్పాడు. చలించిపోయిన పోలీసులు పండ్లు తీసుకరావడానికి వెళ్లారు. తిరిగి వచ్చి ఎంత లేపినా లేవలేదు. ఆకలి తీరకుండానే అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చివరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా ఈ ఘటన కలిచివేసింది. ఇతను గతకొన్ని రోజులుగా ఫుట్ పాత్ పైనే ఉంటున్నాడని, ఆకలితో అలమటిస్తున్నాడని సమాచారం.