వచ్చే నెలలో 10,954 ఉద్యోగాలకు నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మే నెలలో 10,954 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించిందని, ఈ ఉద్యోగాల భర్తీ ఆ దిశలో మరో అడుగ అని మంత్రి తెలిపారు. వీటిలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3తో పాటు టెట్, ఇంజనీరింగ్ సర్వీసులు, డిగ్రీ లెక్చరర్, పోలీసు పోస్టులు ఉన్నాయి.