మోడీ, అమిత్ షా కొత్త స్కెచ్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు అనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను హైకమాండ్ కొంతకాలం వాయిదా వేసిన సంగతె తెలిసిందే. అయితే దీనికి సంబంధించి కీలక సమాచారం బయటికొచ్చింది. అధ్యక్ష రేసులో ఇద్దరి పేర్లు మాత్రమే ప్రముఖంగా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. వాళ్లలో కేంద్రమంత్రులైన ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ ఉన్నారు. వీళ్లిద్దరూ కూడా ఓబీసీ వర్గానికి చెందినవారు.