జూన్ 1 నుంచి సినిమా ధియేటర్లు బంద్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీ నుంచి సినిమాలను థియేటర్లలో బంద్ చేయాలని నిర్ణయించారు. అద్దె ప్రాతిపదికన సినిమాలను తమ థియేటర్లలో ఆడించలేమని, పర్సంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమా థియేటర్లలో మూవీలను విడుదల చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు.
అద్దె ప్రాతిపదికన సినిమాలకు నగదు చెల్లింపులు జరపుతుంటే తమకు థియేటర్ల నిర్వహణ ఖర్చులు కూడా రావడం లేదని అంటున్నారు.