హైడ్రాకు మరో కీలక బాధ్యత

News Published On : Tuesday, June 10, 2025 07:14 AM

తెలంగాణలో వర్షాకాల నిర్వహణ బాధ్యతలను హైడ్రాకు అప్పగించారు. ఈ మేరకు పురపాలక శాఖ కమిషనర్ ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. వరద నీటి నిల్వ, నాలాల్లో పూడికతీత, రహదారులపై బురద, కూలిన చెట్ల తొలగింపు బాధ్యతలు హైడ్రాకు అప్పగించారు. జలమండలి, విద్యుత్ శాఖల సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

కాగా, బ‌ఫ‌ర్ జోన్‌, ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో హైడ్రా అనుమ‌తి లేకుండా ఎవ‌రైనా అక్ర‌మ నిర్మాణాలు చేప‌డితే ఆ ఇంటి నెంబ‌ర్, క‌రెంట్‌, న‌ల్లా క‌నెక్ష‌న్ల‌ను తొల‌గించ‌నున్న‌ట్లు స‌మాచారం. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు న‌ష్ట‌పోకుండా ఉండేందుకే ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లో వ‌చ్చే అవ‌కాశం ఉంది.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...