మోడీ అమరావతి పర్యటన ఖరారు

News Published On : Thursday, April 17, 2025 08:53 PM

రాజధాని అమరావతి నిర్మాణాల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వెనక బహిరంగ సభ వేదికను ఏర్పాటు చేయనుంది. అక్కడ రాజధాని పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 

ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది. మరోవైపు ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేసింది. దానికి తగట్టు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, పర్యటన నోడల్‌ అధికారి వీరపాండ్యన్‌ అధికారులను ఆదేశించారు. ప్రజలు, ప్రముఖులు సభా ప్రాంగణానికి చేరుకునేలా 9 రహదారులను గుర్తించామని తెలిపారు. ఆయా రహదారులపై ఎక్కడా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...