Breaking: మెగా డీఎస్సీ షెడ్యూల్ వచ్చేసింది..
ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా DSC నోటిఫికేషన్ ను నేడు ప్రభుత్వం విడుదల చేయనుంది. మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టులకు దీన్ని రిలీజ్ చేయనుంది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆదివారం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
రేపటి నుంచి మే 15 వరకు ఆన్ లైన్ లో అప్లికేషన్లు స్వీకరించనున్నారు. జూన్ 6 నుంచి జులై 6 వరకు సీబీటీ విధానంలో DSC పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.