మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల

News Published On : Saturday, May 31, 2025 01:05 PM

ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం 16347 ఉద్యోగాలకు గాను మెగా డీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. మెగా డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలను జూన్ 6 నుంచి జులై 6 వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. తాజాగా శుక్రవారం అర్థరాత్రి నుంచి ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్లను అందుబాటులోకి తెచ్చారు. జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు రోజుకు రెండు షిఫ్టుల్లో ఆన్లైన్ మోడ్ లో పరీక్షలు నిర్వహించనున్నారు.